తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనేకమంది కౌంటర్ లు ఇస్తున్నారు.. ఈ క్రమంలో ఎప్పటినుంచో పవన్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే క్రిటిక్ కత్తి మహేష్ చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొఒక్కటిగా ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి ఘాటుగా స్పందించారు.. చంద్రబాబు డైవర్ట్ చేసినట్టు జగన్ చేసే వాడు కాదు.. స్వయం నిర్ణయాధికారం ఉన్న నాయకుడు జగన్ అని అర్థం అంటూ సమాధానం ఇచ్చారు.. అలాగే ఆడ పిల్లలకు పాఠశాలలో మరుగుదొడ్లు లేవు అని నీకు ఇప్పుడే తెలిసిందా.. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా 2020కి అన్ని పాఠశాలలో మరుగుదొడ్లు ఉండాలి, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత.. రాష్ట్ర ప్రభుత్వం విధి.. చాలాచోట్ల పనులు జరుగుతున్నాయి. దీనికి జగన్ నీను సమాధానం చెప్పాల్సిన అని ప్రశ్నించారు..
అలాగే విత్తనాల గింజలు కొనుగోలు చేయడానికి ఒక టైం ఉంటుంది అన్నారు కత్తి.. అక్టోబర్ నవంబర్ నెలల్లో కొనుగోలు చేస్తారని, కొనాల్సిన టిడిపి ప్రభుత్వాన్ని నువ్వు అడగకుండా జగన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నావా అంటూ కత్తి విమర్శించారు.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడానికి కారణం నీకు తెలియదా అని కత్తి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. వరదల సమయంలో జగన్ అమెరికాలో ఉన్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు నువ్వు డ్రగ్స్ వాడుతున్నావో నాకు తెలియదు కానీ దాదాపు మంత్రులందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ వరద సమయంలో ఫీల్డ్ లో ఉండడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి సారిగా జరిగింది.. నువ్వు చూడవు నీకు కనిపించదు నువ్వు ఏ మత్తులో జోగుతున్నావ్ పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించారు. అయితే పవన్ పై కత్తి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టేలా కత్తి ప్రశ్నించడం పట్ల వైసీపీ శ్రేణులు కూడా ఆయన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.