స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపించే పేరు ఇది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న కసి మొత్తం ఇప్పుడు చూపుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా 10 అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో గత ఆరు ఇన్నింగ్స్ లో 144, 142, 92, 211, 82, 80 పరుగులు సాధించాడు. స్మిత్ ని ఆపడం అంటే ఇంగ్లాండ్ బౌలర్స్ కి తలనొప్పిగా మారింది. తన ఆటతో మైమరిపిస్తున్న స్మిత్ కు సీనియర్లు సైతం ఆకర్షితులు అయిపోయారు. మరో బ్రాడ్ మాన్ అవుతాడని అంటున్నారు.
