Home / TELANGANA / తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కౌంటర్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కౌంటర్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కకు, సీఎం కేసీఆర్‌‌కు మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ జరిగి సందర్భంగా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. దేవాదుల, దుమ్ముగూడెంకు గత ప్రభుత్వాలు ఖర్చుచేశాయని , ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తే ఇప్పటికే 35 లక్షల ఎకరాలు పారేవంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా భట్టి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ…కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   తెలంగాణ ప్రజలను మోసగించడానికి కట్టిన ప్రాజెక్టు.. దుమ్ముగూడెంను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్‌స్ట్రోక్‌తో ఇది మన ప్రాజెక్టు కాదని రద్దు చేసుకున్నాం. ఇది నిజం కాదా…అని కేసీఆర్ భట్టిని ప్రశ్నించారు. ఏ పోలవరం అయితే మిమల్ని గోల్‌మాల్ చేసి, ఆ రోజు ఉన్న సమైక్య ప్రభుత్వం పెట్టిందో.. ఆ పోలవరం ప్రాజెక్టులో నిటారుగా ఇందిరాసాగర్ హెడ్‌వర్క్స మునిగిపోయినయి. మీ మనసు ఎట్లా అంగీకరించింది. మీరు ఎట్ల ఒప్పుకున్నరు..మీరు ఒప్పుకుని, మమ్మల్ని కూడా ఒప్పుకోమన్నరు. మేం ప్రాణం పోయినా ఒప్పుకోలే. మా పేగులు తెగేదాకా కొట్లాడినం. ఇది తప్పు ప్రాజెక్టు అని చెప్పినం. ఇందిరా సాగర్ వద్ద మీరు పెట్టిన హెడ్‌వర్క్స్ మునిగిపోలేదా.. ఇవి నిజం కాదా..అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మీరు ప్రతిపాదించింది 20, 30 టీఎంసీలు ఉంటే.మేం సీతారామ ప్రాజెక్టుకు ప్రతిపాదించింది 100 టీఎంసీలు… ఇది సత్యం కాదా…ప్రాజెక్టు పనులు నడుస్తలేవా..అని ప్రశ్నించారు. మీరు చెప్పే అప్పుల్లో ఇందిరాసాగర్‌కు తెచ్చిన 13 వేల కోట్లు లేవా….సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వద్దా… మేం ఏంచేయలే..మీరేం చేయద్దు ..ఇది మీ సిద్ధాంతం. మీరు ఎన్ని రకాల సత్యదూరమైన ప్రచారం చేసినా..మేం అప్పులు చేసైనా ప్రాజెక్టులు కడతాం. అని కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడుతూ.. ఈ రాష్ట్రంలో మీకు అభివృద్ధి కనబడడం లేదా? ఒక్క ప్రాజెక్టు కూడా మీకు కనబడడం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైమ్‌లో కడితే మీకు కనిపిస్తలేదా… భక్తరామదాసు ప్రాజెక్టును ఒక్క ఏడాదిలో పూర్తి చేశాం. ఇది కనబడుత లేదా.. ఈ ప్రాజెక్టు ఉన్నది మీ జిల్లాలోనే కదా? మిషన్‌ కాకతీయ ద్వారా 27వేల చెరువులను నింపాం. ప్రతిపక్షం వంకతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం… కళ్లున్న కబోదుల్లాగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తప్పుగా, అబద్దాలు మాట్లాడితే అడుగడుగునా అడ్డుకుంటాం. సభలో అందరం సమానమే. – ప్రతిపక్షమనే వంకతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదు. – ప్రజలకు వాస్తవాలు తెలియాలి. – కాంగ్రెస్‌ది ఐదేళ్లుగా ఇదే ధోరణి.- ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టినా మీ బుద్ధి మారడం లేదు అంటూ కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat