తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు సదరు పత్రిక, సదరు ఛానల్ పై మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికపై జగన్ కావాలని ఆ చానల్ ను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధం లేదని వైసీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇద్దరికీ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే క్లియర్ గా చెప్పారు.
ఇంతవరకు తనపై దుష్ప్రచారం చేసినా పట్టించుకోలేదని ఇకపై కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వంపై మీడియా చానళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కానీ ఆచానల్ తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్ గా ప్రవర్తించడం.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం పట్ల తాజాగా తీసుకున్న నిర్ణయంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా పేదలకు ఇస్తున్న నాణ్యమైన బియ్యానికి సంబంధించిన అంశంలో సదరు మీడియా దుష్ప్రచారం చేయడం, అలాగే కావాలని రాజధాని పోలవరం పై ప్రభుత్వానికి మచ్చ తేవాలని ఉద్దేశంతో చేసిన ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే నిశితంగా సదరు టీవీని పరిశీలిస్తున్నపార్టీ శ్రేణులు, మేధావులు మాత్రం కచ్చితంగా చానల్ ని నిలిపివేస్తూ మంత్రులు చేసిన సూచనలు సరైనవేనంటున్నారు.