మీకు తల నొప్పిగా ఉందా..?. నొప్పిని భరించలేకపోతున్నారా..? అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి . మీ తలనొప్పిని మాయం చేసుకొండి.
ముందుగా అయితే గోరు వెచ్చని ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం కొంచెం కలుపుకుని త్రాగితే తలనొప్పి తగ్గుతుంది
ఆవుపాలను వేడి చేసి తాగితే కూడా తలనొప్పి మాయమైపోతుంది
భోజనంలో నెయ్యి వేసుకుని తింటే కూడా కాస్త ఫలితం ఉంటుంది
చక్కెర ,నీళ్లు,ధనియాలు కల్పి త్రాగితే కూడా నొప్పి మటుమాయమైపోతుంది
మరి ముఖ్యంగా జలుబు వలన వచ్చిన తలనొప్పికి ఈ చిట్కా ఉపయోగం
కొబ్బరి నూనెతో తలకు దాదాపు పదిహేను నిమిషాలు మర్దనా చేసుకున్న తగ్గుతుంది
నిద్రకు ముందు పావుగంట సేపు కుర్చీలో కూర్చుని పాదాలను వేడినీళ్ల బకెట్లో ఉంచిన తగ్గుతుంది
జీలకర్ర,అల్లం ,కొత్తిమీర కలిపి కషాయం తాగితే తేలికగా తగ్గుతుంది
వెన్న,చాకెట్లు ,మాంసాహారం పదార్థాలకు దూరంగా ఉండాలి
కాలీప్లవర్ ,క్యాబేజీ ,మెంతికూర ఇతర ఆకుకూరల పచ్చళ్లు ఎక్కువగా తినాలి.
