Home / 18+ / జిల్లావ్యాప్తంగా పట్టున్న బలమైన కాపునేత.. టీడీపీకి భారీ దెబ్బ.. గిరాగిరా తిరుగుతన్న ఫ్యాన్.. ముందే చెప్పిన దరువు

జిల్లావ్యాప్తంగా పట్టున్న బలమైన కాపునేత.. టీడీపీకి భారీ దెబ్బ.. గిరాగిరా తిరుగుతన్న ఫ్యాన్.. ముందే చెప్పిన దరువు

అందరూ ఊహించిందే జరుగుతోంది.. తూర్పుగోదావరి జిల్లా సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆపార్టీకి గుడ్ బై చెప్పటం ఖాయమైంది. ఈనెల 18న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తోట వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. త్రిమూర్తులతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు మాజీఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యేగా తోట పనిచేసారు. కొద్దిరోజులుగా ఈయన పార్టీ వీడతారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈనేపథ్యంలో నియోజకవర్గంలోని తన అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ మార్పుపై తోట చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానం తోట పార్టీ మారకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని సమాచారం. చంద్రబాబు తరపున జ్యోతుల నెహ్రూ తోటతో చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీకి వరుస దెబ్బలు తప్పట్లేదు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడారు. ఇప్పుడు మరో ముగ్గురు కీలకనేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ముందుగా ఊహించినట్టుగానే తోట కూడా టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమైంది.

 

ఇక్కడ ముగ్గురు మాజీలు పార్టీని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలక జిల్లాగా ఉన్న పరిగణిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ ఖాయమనే వాదన వినిపిస్తోంది. టీడీపీలో కీలకనేతగానే కాకుండా కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న తోట త్రిమూర్తులు పార్టీ మారితే ఆలోటు తెలుగుదేశం పార్టీకి తీర్చలేనిదనే చెప్పాలి. అలాగే జిల్లావ్యాప్తంగా పట్టున్నతోట చేరికతో అధికారంలో ఉన్న వైసీపీ మరింత పుంజుకుంటదనడంలో సందేహం లేదు. అయితే ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే అనుచరుల ఒత్తిడి, వైసీపీ నుంచి ఆహ్వానం, టీడీపీలో అసంతృప్తి వంటి తదితర కారణాలతో తోట పార్టీ మారతారని దరువు ముందే వెల్లడించింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat