బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలతో సాగుతుంది. ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలసిందే. తాజాగా మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే వీరిద్దరు బిగ్‌బాస్ హౌస్‌లో ఇంతవరకు గొడవపడిన సందర్భాలు లేవు. నేటి ఎపిసోడ్‌లో అది కూడా జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇది నీ ఒక్కదాని ఒపీనియన్ కాదు.. గ్రూప్ అంతటిది అంటూ వరుణ్‌చెప్పగా.. నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది.. నా అభిప్రాయం నేను చెప్పాను.. అంటూ శ్రీముఖి బదులిచ్చింది. అయితే ఇది నా అభిప్రాయం అంటూ వరుణ్ చెప్పగా.. అయితే చెప్పు అని కోపంగా శ్రీముఖి అనడం కనిపిస్తోంది. మరి ఆ అభిప్రాయం ఏంటి? వారిద్దరి మధ్య ఆ గొడవెందుకు మొదలైందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.
