మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో శుభవార్త. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకు ముఖ్య అతిథులుగా జనసేనా అధినేత హీరో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ రాబోతున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకకు తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినప్పటికీ అధికారిక పనుల వల్ల రాలేకపోతున్నారట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.ఈసారి ఏకంగా అభిమానులకు ఒకే స్టేజ్‌పై అన్నదమ్ములు కనిపించనుండటంతో భారీ అంచనాలు పెరిగాయి.
అయితే ఇప్పుడు ఒ వార్త హాట్ టాపిక్ గా మారింది. అది ఏమీటంటే అసలే చిరంజీవి సినిమాకు సంబంధించిన కార్యక్రమం, అందులోనూ పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే…. మెగా అభిమానుల్లో ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విడుదలైన సైరా టీజర్‌కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో తన ప్రసంగంతో ఆకట్టుకోబోతున్నారంట. అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా పవన్ స్టార్ ప్రసంగించబోతున్నారట.
