తమిళనాడు మాజీ సీఎం,దివంగత నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ వస్తున్న సంగతి కోలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెల్సిన విషయమే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దిన్ని తెరకెక్కిస్తున్నాడు.
అలనాటి అందాల రాక్షసి,ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి క్వీన్ అనే పేరు పెట్టారు చిత్రం యూనిట్. అయితే ప్రస్తుతం ఇది చిక్కుల్లో పడింది.
జయలలిత మేనల్లుడు దీపక్ ఈ మూవీని అపకపోతే కోర్టుకెళ్తాను అని హెచ్చరించాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ కు జయలలిత గురించి ఏమి తెల్సు. ఎవరు ఏమి చెప్పారు. ఎవర్ని అడిగి వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఈ మూవీ రీలీజ్ ను ఆపకపోతే కోర్టులో కేసు వేస్తానను అని ఆయన హెచ్చరించాడు.