బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుక్రవారం ఏసీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచినందుకు తనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారని పీవీ సింధు విలేకరులతో చెప్పింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీయిచ్చినట్టు వెల్లడించింది. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు సిపార్సు చేయడం సంతోషం వ్యక్తం చేసింది పీవీ సింధు.