హీరో నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై నాని, విక్రమ్ కుమార్, చిత్రం యూనిట్ మొత్తం భారీ అంచనాలు పెట్టున్నారు. విడుదల అయ్యే ముందువరకు కూడా టెన్షన్ లోనే ఉన్నారు. చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే సినిమా హిట్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పటివరకు అయితే సినిమా బాగానే వెళ్ళిందని చెప్పాలి. కలెక్షన్స్ లు రావాలంటే ఇదే జోష్ ను కొనసాగించాలి. ఇది ఇలా ఉంటే హీరో నాని ప్రస్తుతం థాయ్ ల్యాండ్ వెళ్ళిపోతున్నాడు. నాని వెళ్తున్నది విజయ ఆనందంలో హాలిడే ట్రిప్ కాదు. తన తర్వాత చిత్రమైన ‘వి’ షూటింగ్ మేరకు వెళ్తున్నాడు. ఈ చిత్రంలో నాని నెగటివ్ రోల్ లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి గాను మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే సుధీర్ బాబు అండ్ టీమ్ థాయ్ ల్యాండ్ చేరుకున్నారు.
