కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా ,దారుణంగా హత్య చేసింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది.
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన ఆంజనేయులు . అతడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మమ్మ ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. నేరం బయట పడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మాచర్ల శివారు మండాది రహదారి పక్కన ఉన్న డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి పూడ్చేసింది. ఐదు రోజులుగా ఆంజనేయులు కనిపించకపోవవడంతో ఏమయ్యాడని అందరూ లక్ష్మమ్మను అడగ్గా తనకేం తెలీదని చెబుతోంది. గురువారం ఆంజనేయులు తమ్ముడు అప్పారావు ఆమె వద్దకు వచ్చి తన అన్న ఏమయ్యాడని నిలదీయగా తనకేం తెలీదని చెప్పింది. అయితే వదిన ప్రవర్తనపై అనుమానం వచ్చిన అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో భయపడి తన భర్తను చంపేసిన డంపింగ్ యార్డులో పూడ్చేసినట్లు చెప్పింది. దీంతో అప్పారావు మాచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల గురువారం ఆంజనేయులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు తీవ్రంగా కామెంట్స్ పెడుతున్నారు. వామ్మో ఇలాంటి భార్యలు కూడ ఉన్నార అంటూ ..
