తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ నెల ఎనిమిదో తారీఖున సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రోజు శాసనమండలిలో 2019-20ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో మంత్రి హారీష్ రావు ప్రవేశపెట్టారు.
తాజాగా ఆయా శాఖలతో మంత్రి హారీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలిరోజే తనదైన మార్కును ప్రదర్శించారు మంత్రి హారీష్.. ఈ సందర్భంగా మంత్రి హారీశ్ పలు రూపాల్లో నిధులు సేకరిస్తున్న కానీ పనులు ఎందుకు కావడంలేదు.
నిధులున్న ఆయా శాఖలు ఎందుకు ఖర్చు చేయడం లేదు. మరికొన్ని శాఖలు ఏకైతే ఖర్చు చేయడంలో విఫలమవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో సరిచేసుకోవాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ మంత్రిగా తొలిరోజే నిర్వహించిన సమీక్ష సమావేశంలో తనదైన మార్కును ప్రదర్శించారు అని అక్కడి అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.