సహాజంగా రోడ్లు బాగోకపోతేనో.. రోడ్లపై గుంటలు ఏర్పడితేనో.. లేదా వర్షాలు .. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోతేనో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అందరికి తెల్సు.
కానీ రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు కేంద్రమంత్రి. కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా రహదారులు బాగుంటే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అస్కారముంది.
రోడ్లు బాగుంటే వాహనదారులు అతి ఎక్కువ స్పీడ్ తో అలాంటి రోడ్లపై పోతుంటారు. అదే రోడ్లపై గతుకులు.. గుంటలు ఉంటే స్పీడ్ ను తగ్గించి చాలా నెమ్మదిగా వెళ్తారు. అందుకే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని “ఆయన సెలవిచ్చారు. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.