ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100రోజులు దాటింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ట్రై చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచేయాలని ప్లాన్స్ వేస్తోంది.. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.. ఎలాగో ఈ ఐదేళ్లు ప్రభుత్వానికి తిరుగుండదని టీడీపీ నేతలే భావిస్తున్నా ఆ విషయం చంద్రబాబుకు అర్ధం కావడం లేదు.. ఇదిలా ఉంచితే ఐదేళ్ల తర్వాత కూడా మళ్లీ ఎపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనన్నది మరికొందరి టీడీపీ, వైసీపీ నేతల ధీమా.. దీనికి రెండు బలమైన కారణాలున్నాయి.
- వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా 2024 ఎన్నికల్లో వైసీపీ బలం తగ్గినా.. కొన్ని సీట్లు తగ్గుతాయి.. అదే భారీగా తగ్గి ఓ 50సీట్లు తగ్గినా భారీ మెజార్టీ అంటే 101 వస్తాయి దీనినిబట్టి చూస్తే రావాల్సిన మేజిక్ ఫిగర్ కు ఇంకా 13 సీట్లు ఎక్కువన్నమాట.. ఇది ఒక కారణం.. మరో కారణం ఏమిటంటే..
2. ఇప్పటికే చంద్రబాబుకు వయసు ఎక్కువైపోయింది. 2024 కల్లా ఆయన వయసు మరింత పెరగడం, అదే సమయంలో పార్టీలో నెంబర్ 2 అయిన నారా లోకేష్ తాను పోటీచేసిన చోటే గెలవలేక అసమర్థుడిగా మిగిలిపోయారు. 2024లో పార్టీని కనీసం నడిపించేంత సీన్ కూడా ఇద్దరికీ ఉండదన్నది మరో విశ్లేషణ. ఈరెండు కారణాలతో పదేళ్లపాటు కచ్చితంగా వైసీపీ అధికారంలో ఉంటుందనీ, అందువల్ల టీడీపీలో ఉండడం దండగంటూ కొందరు ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారట.. దీనినిబట్టి అతి త్వరలో దశాబ్ధాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ నావ తెలంగాణలో మునిగినట్టు నిట్ట నిలువుగా ఆంధ్రప్రదేశ్ లోనూ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.