ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 100రోజులు గడవగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ మూడు నెలల్లోనే ఐదేళ్లలో చేయాల్సిన ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టింది. మొదట్లో టీడీపీ వైసీపీ ప్రభుత్వానికి 6నెలల సమయం ఇస్తామని చెప్పింది కానీ విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంటే తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. టీడీపీ బాటలోనే జనసేన కూడా జగన్ పాలనలో జరుగుతున్న చిన్న విషయాన్నీ, జగన్ ఆద్వర్యంలో జరుగుతున్న చిన్న చిన్న తప్పటడుగులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాను చేస్తున్న మంచికంటే టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న విషప్రచారం పెద్దఎత్తున జనంలోకి వెళ్లింది. దీంతో జగన్ సీరియస్ అయ్యారట.
మనం చేసిన మంచి చెప్పుకోవడం కంటే వారు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పకొట్టడంతోనే సమయం సరిపేతో ఎలా అని ప్రశ్నించారట. సీఎంకి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీహరిని నియమించారు. శ్రీహరి గతంలో సాక్షిలో పనిచేశారు. మొత్తం జగన్ పాదయాత్ర మొదటిరోజు నుండి చివరి రోజువరకూ పనిచేసారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచారం సేకరించడంతోపాటు, అధ్యయనం చేసి మీడియా వ్యవహారాల బాధ్యతలను ఆచనే నిర్వర్తించారు. అలాగే జగన్ రాజకీయ ప్రస్థానం, పాదయాత్రల ఆధారంగా ‘అడుగడుగునా అంతరంగం’ అనే పుస్తకం కూడా రాశారు. దీంతో జగన్ సీఎం అయ్యాక శ్రీహరిని సీపీఆర్వోగా నియమించుకున్నారు.
అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారాన్ని కల్పించడంలో విఫలమయ్యారని చర్చ జరగడంతో పాటు ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం సాగడంతో శ్రీహరికి అక్షింతలు పడ్డాయట.. అలాగే మీడియాను కో ఆర్డినేట్ చేసుకుంటూ మంచి పనులను ప్రజలకు చేరువయ్యేలా చేయడం సీపీఆర్వో బాధ్యత కాబట్టి ఈ విషయంలో విఫలం అవడంతో ‘నెగిటివ్ పబ్లిసిటీ ఎలా స్ప్రెడ్ అవుతోంది, మంచి పనులకు ఎందుకు ప్రచారం రావడం లేదు..’ అంటూ జగన్ శ్రీహరిని నిలదీసారట. బెల్ట్ షాపుల రద్దు, భారీ స్థాయిలో ఉద్యోగాలు, జీతాలు, ఫించన్ల పెంపు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల గురించి ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారో చూసుకోవాలని సీఎం ఆదేశించారట.