గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం చీకటిలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు చంద్రబాబుని గెలిపించారు.తమ బతుకుల్లో వెలుగిని నింపుతాడేమో అని అంతా భావించారు. కాని చివరికి రాష్ట్రం మొత్తాన్ని చీకటి చేసేసాడు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదు తన కుటుంబ ప్రయోజనాలు కోసం అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చీకటి రోజుల గురించి చంద్రబాబు గారు చెబ్తుంటే వినాలి. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో ప్రతిపక్ష నేతను విశాఖ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా అరెస్టు చేస్తే అయన దృష్టిలో వెలుతురు రోజు? ముద్రగడ గారిని హౌజ్ అరెస్ట్ చేసి మహిళలను పోలీసులతో బూతులు తిట్టించినపుడు వాళ్ల హక్కులు గుర్తు రాలేదు. అని చంద్రబాబు పై మండిపడ్డారు.