ఏడాది గ్యాప్ తరువాత నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్నాడు. నితిన్,రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తుంది. నితిన్ కు ఈ హిట్ చాలా అవసరం ఎందుకంటే తాను చివరిగా తీసిన చిత్రం శ్రీనివాసా కళ్యాణం. ఈ చిత్రం ఎలా ఉన్నప్పటికీ కమర్షియల్లీ ఫ్లాప్ అనే చెప్పాలి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో తెలిసిన ఇంకొక వార్త ఏమిటంటే… 24కిస్సేస్స్ ఫేమ్ హెబ్బ పటేల్ ఇందులో నెగటివ్ రోల్ లో కనిపించనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘సింగల్ ఫరెవర్’ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇక చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే రిలీజ్ చెయ్యాలని ప్లానింగ్ లో ఉందట. మరి ఈ సినిమా నితిన్ ని నిలుపుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.