నేడు హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం మొదలవుతుంది. తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ వారు ఆకాంక్షలు అమలు చేసారు. ఉదయం ఆరు గంటలు నుండే ఏవి వర్తిస్తాయని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి పోలీసు వారు కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. నిమజ్జనం కారణంగా ఇటు విజయవాడ నుండి వచ్చేవారు ఎల్బీ నగర్ దాటి రాకుడదని, అటు కూకట్పల్లి వరకే అనుమతి ఉందని అన్నారు. అక్కడి నుండి మెట్రో పై రావాలని కోరారు. ఇక నిమజ్జనానికి వచ్చే భక్తులు మెట్రో కి వచ్చి ఖైరతాబాద్ నుండి రావాలని అన్నారు. ఈ మేరకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు కూడా వేసారు.
