Home / ANDHRAPRADESH / పొలిటికల్ అజ్ఞాతవాసి…ఈ నెల్లూరు టీడీపీ నేత…!

పొలిటికల్ అజ్ఞాతవాసి…ఈ నెల్లూరు టీడీపీ నేత…!

అనగనగా ఓ రోజు సినిమా గుర్తుందా..ఆ సిన్మాలో బ్రహ్మానందం..నెల్లూరు పెద్దారెడ్డిగా తెగ బిల్డప్ ఇస్తాడు. అయితే పోలీసులు అమాంతం ఎత్తి లోపలేస్తారు. అలాగే రాజకీయాల్లో కూడా నిన్నటిదాకా తెగ బిల్డప్ ఇచ్చిన ఈ నెల్లూరు సోమిరెడ్డి జైల్లోకి పోతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా 5 సార్లు ఓడిపోయినా…నెల్లూరు పెద్దారెడ్డిగా బిల్డప్ ఇచ్చుకునే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు ప్రస్తుతం ఫోర్జరీ కేసులో ఇరుక్కుపోయాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలో వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే..టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే మాజీ మంత్రి పొద్దున లేస్తే ప్రెస్‌మీట్ పెట్టి నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకునేవాడు.. రోజూ ఉదయాన్నే టీడీపీ ఆఫీసుకు రావడం.. లక్ష కోట్లు, 11 కేసుల్లో ఏ1 ముద్దాయి..అంటూ జగన్‌పై విరుచుకుపడుతూ…ఓ గంట సేపు చెప్పిన సోదినే మళ్లీ మళ్లీ చెప్పి..మైకుల తుప్పులు వదిలించి, జర్నలిస్టు వర్గాల్లో సోదిరెడ్డిగా పేరుగాంచాడు. చంద్రబాబు మెప్పు కోసం ప్రతి రోజూ జగన్ని ఏ1 ముద్దాయి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సోదిరెడ్డి…సారీ సోమిరెడ్డి ఇప్పుడు తానే ఏ1 ముద్దాయిగా ఓ కేసులో ఇరుక్కుపోయి పారిపోయాడు. ఇది నిజంగా విధి చిత్రమే.

నెల్లూరు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో ఫోర్జరీకి పాల్పడి.. వెంకటాచలం మండలం, ఇడిమేపల్లిలోని తన 2.41 ఎకరాల భూమి రికార్డులు తారుమారు చేశారంటూ బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు.. దీంతో కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సోమిరెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చింది. ఈ కేసును సమగ్రంగా విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు, విచారణకు హాజరు కావాల్సిందిగా రెండు సార్లు నోటీసులు జారీ చేసినా..సోమిరెడ్డి విచారణకు హాజరు కాలేదు.. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయి విచారణకు హాజరు కాకుండా న్యాయవాదులను పంపి డాక్యుమెంట్లు చూపించాడు. అయితే ఈ కేసులో నేరుగా సోమిరెడ్డినే విచారించాల్సి ఉండడంతో పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లగా అక్కడ కూడా లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీస్ అతికించారు. తాజాగా హైకోర్టులో సోమిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై జరిగిన విచారణలో కోర్టు 41ఏ నోటీసు జారీ చేసి విచారించాలని ఆదేశించింది. దీంతో జైలుకు పోతాననే భయంతో సోమిరెడ్డి పార్టీ క్యాడర్‌కు కనీసం ఫోన్‌లో కూడా ఆందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సోమిరెడ్డి పరారీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే కోడెల, యరపతినేని, చింతమనేని, కూన రవికుమార్ వంటి వివాదాస్పద టీడీపీ నేతలు జైలు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేయగా, కోడెల, ఆయన ఫ్యామిలీని కూడా విచారణకు హాజరు కావాలని హైకోర్ట్ చెప్పింది.తాజాగా సోమిరెడ్డి కూడా అజ్ఞాతంలో వెళ్లడంతో ఏ 1, ఏ 1 అంటూ సోది చెప్పి..చివరకు నువ్వే ఏ1 ముద్దాయిగా పారిపోయావా సోమిరెడ్డి అంటూ నెల్లూరు జనాలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా రాజకీయాల్లో నా అంత నీతివంతుడు లేనట్లు బిల్డప్ ఇచ్చిన నెల్లూరు సోమిరెడ్డి…ఏ1 ముద్దాయిగా పారిపోయి పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారాడంటూ నెట్‌‌జన్లు సెటైర్లు వేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat