సొట్ట బుగ్గలు తన సొంతం… కుర్రకారును కళ్ళు తిప్పుకొకుండా చేసే అందం తనది. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉంటుంది తన నవ్వు. వీటిన్నిటికి తోడు చక్కని అభినయం. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. అయితేనేమి తాను నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..?.
ఇది అంత సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించే. ఆమె ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు. ఏ రంగం చూసుకున్న కానీ విజయం వస్తే అది తామొక్కరి వలనే సాధ్యమయింది అని గబ్బాలు కొడతారు. అదే ఫెయిల్యూర్ వస్తే మాత్రం ఎదుటివాళ్లపై వేస్తారు. ఇక్కడ జరిగింది అదే.
ఇప్పటివరకు నేను నటించిన మూవీల్లో చాలా సార్లు ఒకటో రెండో పాటలకు అవకాశమిస్తారు. నాకు నేను ప్రూవ్ చేసుకునే పాత్రలు ఒక్కటి ఇవ్వలేదు. సినిమా ఫెయిల్యూర్ అయితే నాదా తప్పు. నన్ను ఐరన్ లెగ్ అని ముద్రవేశారు అని అమ్మడు వాపోయింది. అయిన కానీ జయపజయాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.