తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు కోసం నియమించిన ఇంఛార్జ్,పార్టీ ప్రధాన కార్యదర్శులతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”పార్టీకోసం కష్టపడిన వాళ్లకే పదవులు వస్తాయి.కాస్త అలస్యమైన కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరు కల్సి కట్టుగా పనిచేయాలి.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని” ఆయన సూచించారు.ఆయన ఇంకా మాట్లాడుతూ “దేశంలో అత్యంత బలమైన పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. పార్టీకోసం కార్యకర్తలు,నేతలంతా సమన్వయంతో పని చేయాలని అన్నారు.