ఏపీ ప్రజలు బుద్ధి చెప్పి 100 రోజులు కూడా కాలేదు…టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుద్ధి మాత్రం మారలేదు.గత ఐదేళ్లు గ్రాఫిక్స్ జిమ్మిక్కులతో అమరావతి సెంటిమెంట్‌ను, నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, ఆ దీక్షలు.ఈ పోరాటాలు అంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే తప్ప అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. ఐదేళ్ల బాబు పాలన అవినీతి అరాచకాలకు కేంద్ర బిందువుగా మారింది. స్వయంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు రాజధాని పేరుతో భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. గత టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణకు సిద్ధమవుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే రాజధానిని అమరావతి నుంచి జగన్ సర్కారు తరలిస్తుందంటూ బాబు అండ్ కో దుష్ప్రచారం మొదలు పెట్టింది. అమరావతి సెంటిమెంట్ రగిలించి ఆ సెగలో చలి కాచుకోవాలని అనుకున్నాడు బాబు. టీడీపీకి కొమ్ము కాసే ఎల్లో మీడియా ఛానళ్లు అమరావతి తరలిపోతుందంటూ పచ్చ కథనాలు కమ్మగా వండివార్చాయి. అయితే రాజధాని రైతులను ఎంతగా రెచ్చగొట్టినా..ప్రయోజనం లేకుండా పోయింది.
రాజధాని విషయంలో తమ ప్లాన్ రివర్స్ అవడంతో బాబు, లోకేష్‌లు వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో పడ్డారు. ఇటీవల వరదల నేపథ్యంలో బ్యారేజీకి పడవ అడ్డం పెట్టి ప్రభుత్వం కావాలనే తన ఇంటిని ముంచేసిందని అడ్డదిడ్డంగా వాదించి…ఎల్లోమీడియాలో ప్రచారం చేయించాడు. తన ఇంటి చుట్టూ కావాలని డ్రోన్ కెమెరాలు తిప్పుతున్నారంటూ, తనకు రక్షణ లేదంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు నానా యాగీ చేశారు. ఇక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని భావించి బొక్కబోర్లా పడింది. వరద ముంపు నేపథ్యంలో రైతు వేషంలో సీఎం జగన్‌ను, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషించిన శేఖర్ చౌదరితో పాటు, సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్‌జైలుకు తరలించారు. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే బాబు బ్యాచ్ ఇలా పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ప్రజలకు అర్థమైపోయింది. ఇక తిరుమలలో ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమతప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ టీడీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం రివర్సైంది. ఇలా ఎన్ని డ్రామాలు ఆడినా లాభం లేకపోవడం చంద్రబాబు పల్నాడుపై పడ్డాడు.
పల్నాడులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ..పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ఛలో ఆత్మకూరు అంటూ మరో డ్రామాకు తెరతీశారు చంద్రబాబు. రాష్ట్రంలో హింసాకాండ చెలరేగుతుందని జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, తద్వారా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా చంద్రబాబు ఈ టీడీపీ పునరావాస కేంద్రాల డ్రామా స్టార్ట్ చేయించాడు. ఏదో అక్కడక్కడా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులకు రాజకీయ రంగు పులిమి..చంద్రబాబు తనదైన నీచరాజకీయం మొదలుపెట్టాడు. దీంతో పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే చంద్రబాబు ఏర్పాటు చేయించిన పునరావాస కేంద్రాలకు పోలీసులు వెళ్లి అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలతో మాట్లాడడమే కాకుండా ఇరువర్గాల నేతలను పిలిపించి రాజీ చేస్తున్నారు. స్వయంగా పోలీసులు దగ్గరుండి టీడీపీ కార్యకర్తలను వాళ్ల వాళ్ల సొంత ఊళ్లకు పంపిస్తున్నారు. అయితే చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయా ఊళ్లల్లో సమస్యే లేదంటూ తెలుస్తోంది. తాజాగా కొన్ని ఛానల్స్ ఆత్మకూరు పల్లెలకు వెళ్లగా …చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయా ఊళ్లల్లో సమస్యే లేదంటూ తెలుస్తోంది. గత ఐదేళ్లు టీడీపీ నేతల అరాచకాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపాం..సీఎంగా జగన్ వచ్చిన తర్వాతే ప్రశాంతంగా బతుకుతున్నాం..మళ్లీ పచ్చటి పల్లెల్లో చంద్రబాబు తన రాజకీయం కోసం చిచ్చు పెడుతున్నాడంటూ ప్రజలు తిడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ పునరావాస కేంద్రాలలో ఉన్న వాళ్లలో 50 శాతం ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు కాదని, వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే అని తెలిసి పోలీసులు నోరెళ్లబెడుతున్నారంట. టీడీపీ కార్యకర్తల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను తీసుకువచ్చి, వారికి రోజుకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు…చికెన్ బిర్యానీలు పెట్టి పోషిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పునరావాస కేంద్రాలలో ఉన్న టీడీపీ కార్యకర్తలంతా మాత్రం పోలీసుల సహకారంతో, ప్రత్యర్థి పార్టీల నాయకులతో రాజీ చేసుకుని తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈ పునరాస శిబిరాలు ఖాళీ అయిపోతుండడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు..స్థానిక నేతలు ఇలా.. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలుగా పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నారని సమాచారం. పోలీసుల ఎంక్వైరీలో ఈ టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల బాగోతం బయటపడిందని తెలుస్తోంది.దీంతో ఛీఛీ..పునరావాస కేంద్రాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా బాబూ..నువ్వు మారవా..ఇకనైనా ఈ డ్రామాలు ఆపు.. అంటూ పల్నాడు ప్రజలు చంద్రబాబును ఛీత్కరించుకుంటున్నారు.