ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా చలనాలు ఏకంగా రెండు నుంచి నాలుగు రెట్లు పెంచింది కేంద్రం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మారిన కొత్త రూల్స్ పై,చలనాలపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి.
అయితే తెలంగాణలో మాత్రం మారిక కొత్త రూల్స్ కు బలి అయ్యాడు ఒక బాధితుడు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో పోయిన శుక్రవారం నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ లో ఒక బాధితుడు పట్టుబడ్డాడు.
అతనికి మారిన రూల్స్ ప్రకారం రూ.10వేలు జరిమానా విధించారు. అయితే ఇది గతంలో రూ.2వేలు ఉండేది. సదరు వాహనదారుడి వాహానాన్ని సీజ్ చేసిన పోలీసులు మంగళవారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్తే తొలి నేరంగా పరిగణించి బాధితుడికి పదివేల జరిమానా విధించారు. ఒకవేళ ఈ జరిమానా చెల్లించకపోతే పదిహేను రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించాడు.