భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో మొదలువుతుంది. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంమైంది. బాలపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18.కి.ల పాటు శోభాయాత్ర కన్నులపండుగగా సాగనుంది. ఇక బాలాపూర్ వినాయకుడు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదూ… ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం పాట ధర పెరుగుతూనే ఉంది. గత ఏడాది లడ్డూ రూ.16.60 లక్షలు పలికింది. దీంతో ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది లడ్డూ కోసం 19 మంది పోటీపడగా..కొలను రాంరెడ్డి అనే వ్యక్తి 17,60,000/_లకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. దీంతో ఈ బాలాపూర్ లడ్డూ వేలంపాటలో సరికొత్త రికార్డును కొలను రామిరెడ్డి క్రియేట్ చేశారు.
