తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్‌ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్‌లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష నాయకుడు…జగన్‌ను కించపర్చేలా లక్ష కోట్లు దోచుకున్న గజదొంగ అంటూ సెటైరికల్ పోస్టులు పెట్టి అవమానించిన ఘటనలు ఎన్నో. గతంలో కూడా పలు సందర్భాల్లో తాము చేస్తే ఒప్పు…అదే పని ఎదుటోళ్లు చేస్తే తప్పు అంటూ తండ్రికొడుకులు అడ్డదిడ్డంగా వాదించిన ఉదంతాలు ఉన్నాయి.
తాజాగా పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ, రాజకీయ పునరావాస కేంద్రాలు పెట్టి..ఛలో ఆత్మకూరు అంటూ రాజకీయ డ్రామాలకు తెరతీశారు బాబు, లోకేష్‌లు. దీంతో పల్నాడులో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించి చంద్రబాబుతో సహా, జిల్లాలలో టీడీపీ నేతలందరినిని హౌస్ అరెస్ట్ చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెడుతున్న చంద్రబాబుపై కొందరు వైసీపీ అభిమానులు ఓ సెటైరికల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫోటోలో బిన్ లాడెన్ బాడీకి ఫోటోషాప్‌లో బాబు తల అతికించి… పల్నాడులో అరాచకాలు చేయడానికి వెళుతున్న పొలిటికల్ టెర్రరిస్ట్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మార్ఫింగ్ ఫోటోను గమనించిన నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?’ అంటూ లోకేష్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. దీంతో నెట్‌జన్లు లోకేష్‌పై విరుచుకుపడుతున్నారు. గత ఐదేళ్లు నీ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్, మీ పార్టీ అభిమానులచేత ప్రతిపక్ష నాయకుడు జగన‌్‌ను.. గజదొంగగా మార్ఫింగ్ చేసి కించపర్చేలా పోస్టులు పెట్టించావు..మొన్నటికి మొన్న సీఎం జగన్‌ను, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో కించపర్చేలా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు పెట్టించావు. ఆశావర్కర్లు ధర్నా చేస్తున్నారంటూ..తెలంగాణలో జరిగిన ధర్నా ఫోటోను మార్ఫింగ్ చేయించి..సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించావు. ఇప్పుడు నీ అయ్యను ఎవరో మార్ఫింగ్ చేస్తే లొల్లి చేస్తున్నావు..అయినా మీకంటే మార్ఫింగ్ రాజాలు ఎవరుంటారూ లోకేష్..నువ్వే పెద్ద మార్ఫింగ్ రాజావి..అందుకే అందరూ నిన్ను ఫాలో అవుతున్నారంటూ..నెట్‌జన్లు లోకేష్‌పై సెటైర్లు వేస్తున్నారు..
.@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా? pic.twitter.com/RgkjWNOTYP
— Lokesh Nara (@naralokesh) September 11, 2019