ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించి ,కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాములమ్మ. ఇక తాజాగా టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్నకొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత విజయశాంతి కెమెరా ముందుకు రావడంతో ఈ సినిమాకు మరికాస్త హైప్ ఏర్పడింది. కాగా, విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. 1989లో ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో ఆమెతో పాటు తాను కూడా నటించానని వెల్లడించారు. విజయశాంతి గారితో నటించడం తనకు అదే ప్రథమం అని వివరించారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతి గారితో నటిస్తుండడం చూస్తుంటే కాలచక్రం గిర్రున తిరిగివచ్చిందన్న ఫీలింగ్ కలుగుతోందని తెలిపారు. అంతేగాకుండా, ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను కూడా ట్వీట్ చేశాడు.
It all started here ..⏳
Year – 1989
Location – Sets of Koduku Diddina Kapuram
.
.
30 years later ⌛
.
.
I'm working with @vijayashanthi_m garu once again in #SarileruNeekevvaru… life has come a full circle…?#throwbackthursday #nostalgia pic.twitter.com/cEjrPhadKr— Mahesh Babu (@urstrulyMahesh) September 12, 2019