న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో 24గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ కు రెండురోజుల ముందే ప్రీ బుకింగ్ పెట్టినా. ఇప్పటివరకు సగం టికెట్స్ కూడా ఫిల్ అవ్వలేదంట. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు సినిమాలో ఎంత స్టఫ్ ఉంది అనేది. ఇది నానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. సినిమా మొదటిరోజే పిక్ అప్ అవ్వకపోతే కలెక్షన్లు రావడం కష్టమే. మరి ఎందుకు ఇలా జరిగింది అనే విషయానికి వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫస్ట్ లుక్ ఇలా అన్ని బాగానే చేసినప్పటికీ ప్రమోషన్లు మాత్రం చాలా నెమ్మదిగా లాగారని అందరు అభిప్రాయపడుతున్నారు, ఇదే దీనికి ముఖ్య కారణమని భావిస్తున్నారు,