తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుల్లిగిల్ల సత్తయ్య కొన్ని రోజుల కిందట వ్యవసాయ పనుల మీద పోలానికెళ్లాడు.
దురదృష్టావత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించాడు. మంత్రి హారీశ్ రావు ఇంటికి వచ్చి తమ బాధను వ్రెళ్లదీసుకున్న సత్తయ్య కుటుంబానికి భరోసానిచ్చారు. ప్రభుత్వం తరపున అందాల్సిన నష్టపరిహారంపై అధికారులతో మాట్లాడి త్వరగా అందించాలని ఆదేశించారు.
అంతేకాకుండా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్న సత్తయ్య పెద్ద కుమారుడు వరుణ్ కుమార్ ఖర్చుల నిమిత్తం రూ. యాబై వేలను తన వ్యక్తిగతంగా సాయం అందించి నేనున్నాను అని ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు మంత్రి హారీశ్ రావు.