ఏపీలో ఇటీవలి ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇకనుంచైనా ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, నవ్యాంధ్ర ప్రగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ 3 నెలల్లోనే చంద్రబాబు ఆ ఆశలను అడియాసలు చేశారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడిగా, యువ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన పోయి..ఇలా రోజుకో డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వంపై పదే పదే దుష్ప్రచారాలకు పాల్పడుతూ రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పొడవడం..ఒక్క చంద్రబాబుకే చెల్లింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి..100 రోజులు కూడా కాలేదు. ఏ ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చాక…పాలన గాడిలో పడడానికి కనీసం ఆర్నెళ్లు పడుతుంది. కానీ చంద్రబాబు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులు కాకముందే విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. తీవ్రమైన అసహనంతో ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు గుప్పిస్తూ.. వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ఇలా ప్రవర్తించలేదు. ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వ్యవహరించిన చంద్రబాబు..ఇప్పుడు కుటిల రాజకీయవేత్తగా కనిపిస్తున్నాడు. విజ్ఞత, విచక్షణ మరిచిన నేతగా కనిపిస్తున్నాడు. చనిపోయిన తన పార్టీని బతికించుకోవడానికి ఆరాటపడుతున్న శల్యసారథిగా కనిపిస్తున్నాడు.
వాస్తవానికి గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అడుగడుగునా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలే కనిపిస్తాయి. పై స్థాయిలో బాబు, లోకేష్, మంత్రుల నుంచి నుంచి కింది స్థాయి వరకు టీడీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని విమర‌్శలు వచ్చాయి. ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, మట్టి మాఫియా, గ్రానైట్ మాఫియా, మైనింగ్ మాఫియా…ఇలా దోపిడీకి కనర్హం లేదన్నట్లుగా పంచభూతాలను లూటీ చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులుపెడుతూ, భౌతిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు,లోకేష్, గత టీడీపీ మంత్రులు, బాబు సామాజికవర్గానికే చెందిన పెద్దలు..రైతుల దగ్గర భూములు లాక్కుని రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసారన్న అపవాదు ఉంది. అలాగే రాజధాని భూములు, పోలవరంతో సహా వివిధ సాగునీటి ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ విచారణ జరిపిస్తానని ప్రకటించాడు. ఇందులో తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తప్పు చేయకపోతే.. ఇంతలా భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది…ఇంతలా ప్రతి నిత్యం ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా డ్రామాలు ఆడుతూ..రచ్చ చేయించడం ఎందుకు…సోషల్ మీడియాలో సీఎం జగన్‌పై, వైసీపీ కీలక నేతలపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయించడం ఎందుకు..ఇక్కడే ప్రజలకు సందేహాలు వస్తున్నాయి.
రాజధానిపై రగడ – పోలవరంపై హంగామా :
తొలుత అమరావతి నుంచి రాజధానిని జగన్ సర్కార్ తరలిస్తుందంటూ రచ్చ చేయించాడు. అసలు సీఎం జగన్ తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామంటూ అధికారిక ప్రకటన రాలేదు. వరద ముంపు నేపథ్యంలో అమరావతి రాజధానిగా క్షేమం కాదు అన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రాజధానిని జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తుందంటూ..చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు నానా యాగీ చేశారు. టీడీపీ నేతల చేత ప్రభుత్వంపై బురద జల్లించాడు..అమరావతి సెంటిమెంట్‌ను వాడుకుని ఎల్లోమీడియాలో రాజధాని తరలిపోతుందంటూ కథనాలు ప్రసారం చేయించి… అమాయక రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పాడు. కాగా రాజధానిని అమరావతి నుంచి తరలించే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పోలవరంపై జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌కు వెళితే..చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపించాడు. ఆంధ‌్రులకు వరప్రదాయని అయిన పోలవరం ఆగిపోతుందంటూ దుష్ప్రచారం చేయించాడు. చంద్రబాబు డ్రామాలు చూస్తుంటే.. రాజధాని, పోలవరం సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఎవరికైనా అర్థమవుతుంది. ఇంత చిన్న లాజిక్‌ను బాబు ఎలా మర్చిపోయాడో మరి.
పల్నాడు డ్రామా :
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలోఫ్యాక్షన్ తగాదాలు, మైనింగ్ మాఫియాలు పెచ్చుమీరాయి. చంద్రబాబు, లోకేష్‌ల అండతో కోడెల, యరపతినేని, చింతమనేని వంటి నేతలు అరాచకం సృష్టించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, కే ట్యాక్స్‌లు, భూ కబ్జాలు, రియల్‌ఎస్టేట్ దందాలు..ఇలా టీడీపీ నేతల అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోయింది. వైసీపీ నేతలు గ్రామాల్లో తిరగలేనటువంటి భీతావహ పాలన బాబు హయాంలో సాగింది. అయితే రాజధానిపై ఎంత రగడ చేసినా..ఫలితం లేకపోవడంతో పల్నాడుడ్రామాకు తెర తీశాడు చంద్రబాబు. అధికార మార్పిడి తర్వాత ఎక్కడైనా ప్రత్యర్థులపై రాజకీయ దాడులు జరగడం సహజం. గ్రామాల్లో వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడులకు రాజకీయ రంగు పులిమి చంద్రబాబు క్షుద్ర రాజకీయానికి పాల్పడుతున్నాడు. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ..పునరావాస కేంద్రాలు పెట్టి..ఛలో ఆత్మకూరు అంటూ బాబు చేస్తున్న రచ్చ వెనుక కచ్చితంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్ర కనిపిస్తోంది. రాష్ట్రంలో హింసాకాండ చెలరేగుతుందని జాతీయ స్థాయిలో ప్రచారం చేయించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రగిలించడం.., ఇటు తన అవినీతి అక్రమాలపై కేసులు రాకుండా చూసుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది.
చంద్రబాబు డ్రామాల వెనుక రహస్యం :
చంద్రబాబు ఇంతలా ఎందుకు వణికిపోతున్నాడు..ప్రతిపక్షంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే..ప్రభుత్వంపై ముప్పేటా ఎందుకిలా దాడులు చేస్తున్నాడు…అంటే ఒక్కటే..తనపై కేసులు విచారణ జరిపించుకోకుండా చూసుకోవడం. కేంద్రంలోని మోదీ సర్కార్ కూడా చంద్రబాబుపై సానుకూలంగా లేదు. తమతో నాలుగేళ్లు కలిసి ఉండి.. ప్యాకేజీ వంటి ప్రయోజనాలు అన్నీ పొంది..కేవలం అధికారం కోసం చివరి ఏడాది యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబుపై మోదీ, అమిత్‌షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోనియా, రాహుల్‌తో చేతులతో కలిపి, ఏపీ ప్రజల్లో తమను విలన్లుగా చిత్రీకరించి.. దేశమంతటా ఓడించాల్సిన చూసిన చంద్రబాబుపై ప్రధాని మోదీకి పీకల్లోతు కోపం ఉంది. మరోవైపు మోదీ సర్కార్ చిదంబరం, శివకుమార్, అహ్మద్‌పటేల్ వంటి నేతలపై సీబీఐని ప్రయోగించింది. చిదంబరం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, ఈ చిదంబరానికి, చంద్రబాబుకు ఉన్న చీకటి సంబంధం దేశ ప్రజలందరికీ తెలిసిందే. చిదంబరం తర్వాత నెక్ట్స్ టార్గెట్ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేషే అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్, టీడీపీ హయాంలో రాజధాని, పోలవరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తే కచ్చితంగా కేంద్రం సహకరించి తీరుతుంది. ఇదే చంద్రబాబులో భయాందోళన కలిగిస్తోంది. ఈ కేసుల్లో విచారణ జరిగితే తాను, తన కొడుకు లోకేష్‌లు జైలుకు వెళ్లే అవకాశం ఉందని బాబు భయపడుతున్నాడు.
రాజకీయాల్లో తనకు ఆపద వచ్చినప్పుడల్లా మైండ్ గేమ్‌లు ఆడడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా..ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు అమరావతికి వచ్చి హైదరాబాద్‌లో మన ఆంధ్రావాళ్లకు రక్షణ లేదు, మీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది అంటూ…ప్రజల సెంటిమెంట‌్‌ను రెచ్చగొట్టాడు. టెలిఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంటూ పదే పదే ప్రచారం చేయించి తెలివిగా తప్పించుకోగలిగాడు. ఇప్పుడు ఏపీలో ఘోర పరాజయం దరిమిలా.. టీడీపీ ఉనికి ప్రశ్నార‌్థకం అయింది. టీడీపీ రాజ్యసభా పక్షం పూర్తిగా బీజేపీలో కలిసిపోయింది. కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబే తమ పార్టీ నేతలను బీజేపీలోకి పంపిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ, వైసీపీ వైపు చూస్తున్నారు.,ఇప్పటికే కొందరు బీజేపీ కండువా కప్పుకోగా, మిగిలిన వారంతా గోడదూకడం ఖాయం అన్న వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే బాబు హయాంలో ఇష్టారాజ్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, అవినీతి, అక్రమాలకు పాల్పడిన కోడెల, యరపతినేని, చింతమనేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి నేతలు కేసుల్లో ఇరుక్కుని, జైలుకు పోతామనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి తరువాత తాను జైలుకుపోక తప్పదని భావించిన చంద్రబాబు..ఇలా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా అలజడి రేపుతూ… ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చే పనిలో పడ్డాడు. ఇలా అయితే జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయిపోయి తన కేసుల జోలికి వెళ్లదని చంద్రబాబు ఆలోచన. కేవలం తనపై కేసుల విచారణ జరిపించకుండా ఉండడం కోసం, చనిపోయిన తన పార్టీని బతికించుకోవడం కోసం, ఛలో ఆత్మకూరు అంటూ నిత్యం డ్రామాల మీద డ్రామాలు ఆడిస్తున్నాడు. ఇవాళ ఛలో ఆత్మకూరు అంటాడు..రేపు ఛలో దెందులూరు అంటాడు.,ఎల్లుండి..ఛలో సర్వేపల్లి అంటాడు.. ఇలా వరుసగా డ్రామాలు ఆడుతూ..చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతున్నాడు. రాష్ట్రంలో హింసాకాండ చెలరేగేలా చేస్తే పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఉంటాయని, తద్వారా జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని, చంద్రబాబు కుటిల ఆలోచన..ఆయనకెప్పుడూ.. ప్రజల ప్రయోజనాల కంటే..తన సొంత ప్రయోజనాలు, తన సామాజికవర్గం ప్రయోజనాలు కాపాడుకోవడానికే ప్రయత్పిస్తాడు. రాజకీయాల్లో ఇంతకంటే నైతికంగా దిగజారుడుతనం ఉండదు. అందుకే అంటారు…తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు అంతటి నీచ మనస్తత్వం గల కుటిల రాజకీయ వేత్త మరొకరు ఉండరని అంటుంటారు. బాబు లాంటి నేత ఉండడం నిజంగా తెలుగు ప్రజల ఖర్మ.