వినాయక చవితి అంటే ముందు గుర్తోచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ. అంతగా ఈ రెండు ప్రాచుర్యం పొందాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ముప్పై తొమ్మిదేళ్ల కింద అంటే సరిగ్గా 1980లో ఏర్పాటైంది. కానీ లడ్డూ వేలం మాత్రం పద్నాలుగేళ్లు అంటే 1994లో మొదలైంది. అప్పట్లో కొలను మోహాన్ రెడ్డి రూ. 450కే దక్కించుకున్నారు.
ఆ తర్వాత ఏడాదికి మరల అతనే రూ.4,500లకు సొంతం చేసుకున్నాడు. ఇక అక్కడ నుండి ఎప్పుడు లడ్డూ వేలం ఏడాదికి ఏడాది పెరుగుతూ వచ్చింది.1996లో రూ.18,000..1997లో రూ.28,000..1998లో రూ.51,000..1999లో రూ.65,000..2000లో రూ.66వేలు,2001లో రూ.85వేలు ధర పలికింది.2002లో రూ.1.5లక్షలు,2003లో రూ.1.55లక్షలు,2004లో 2.1లక్షలు.
2005లో రూ. 2.08 లక్షలు,2006లో రూ. ౩లక్షలు,2007లో రూ.4.15 లక్షలు,2008లో రూ. 5.07లక్షలు,2009లో రూ. 5.10లక్షలు,2010లో రూ.5.30 లక్షలు,2011లో రూ.5.45 లక్షలు,2012లో రూ.7.50లక్షలు,2013లో రూ.9.26 లక్షలు,2014లో రూ.10 లక్షలు,2015లో రూ. 10.32లక్షలు,2016లో రూ.14.65 లక్షలు,2017లో రూ.15.6 లక్షలు,2018లో రూ.16.60 లక్షలు పలికింది.