ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి జైల్లో అందరికీ ఇచ్చే ఆహారమే ఇస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా చిదంబరానికి తన ఇంటి నుంచి ఆహారం అందజేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ న్యాయమూర్తికి విన్నవించారు.
ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ అందరికీ ఇచ్చే ఆహారమే ఆయనకు ఇస్తారని చెప్పారు. చిదంబరం 74ఏళ్ల వయస్సున్నవాడని కపిల్ సిబాల్ వాదించగా దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రతిస్పందిస్తూ చౌతాలా (ఐఎన్‌ఎల్డి నేత ఓం ప్రకాశ్ చౌతాలా) కూడా వృద్ధుడేనని, ఆయన కూడా ఓ రాజకీయ ఖైదీ అని చెప్పారు. ప్రతి ఒక్కరినీ విడివిడిగా చూడలేమని ఈ సందర్భంగా ఆయనన్నారు.