“అమ్మాయిలు హానికరం కాదుకానీ… పక్కలోకి పనికివస్తారంటూ” రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన టాలీవుడ్ సినీ నటుడు చలపతిరావు .తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ . ఆ కామెంట్ పట్ల మహిళా సంఘాలు అయితే చలపతిరావు అనే వ్యక్తి బతకడమే వేస్ట్ అనే స్థాయిలో మండిపడ్డారు. సినిమా వాళ్ల బలుపు చూపించాడంటూ ఇష్టమొచ్చినట్టు నన్ను తిట్టిపోశారు. కొన్ని వందలసార్లు క్షమాపణ చెప్పినా కూడా ఎవరూ కనీసం కనికరించలేదు. మీడియా కూడా తన విషయంలో చాలా ఘోరంగా వ్యవహరించిందని చప్పుకొచ్చాడు. ఈ బాధ అంతా తట్టుకోలేక ఓ క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఆ సూసైడ్ నోట్లో మహిళా సంఘాల పేర్లు రాసి.. వాళ్లకు క్షమాపణలు చెప్పాలనుకున్నట్లు చలపతి తెలిపాడు.