దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఉన్న చలనాల కంటే రెండు మూడింతలు ఎక్కువగా చేస్తూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ రూల్స్ ను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలే మాత్రమే అమలు చేస్తోన్నాయి.
కొత్త రూల్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి గడ్కారీ మాట్లాడుతూ” ట్రాఫిక్ రూల్స్ మార్చడం.
కొత్తవి చేయడమనేది ఉమ్మడి జాబితాలోని అంశం. కేంద్రం తీసుకొచ్చిన ఈ ట్రాఫిక్ రూల్స్ పై కొత్త చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయాలా.. వద్దా అనేది ఆయా రాష్ట్రాలపై ఆధారపడి ఉంది. అయితే అయా రాష్ట్రాల్లో జరిగే ప్రమాదాలకు మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆయన సూచిస్తూ”అసహానాన్ని వ్యక్తం చేశారు.