బిగ్ బాస్ ఎమోషనల్‌గా సాగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈక్రమంలో మధ్యలో హౌజ్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. అయితే యాంకర్ లోస్లియాకు మాత్రం ఈ సందర్భంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి గురవుతూనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. లోస్లియా తన తోటి కంటెస్టెంట్ అయిన కేవిన్‌తో సన్నిహితంగా ఉంటుంది. అయితే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా బయట ప్రచారం సాగుతోంది.
ఈనేపథ్యంలో లోస్లియా తీరుపై ఆమె తండ్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేను నిన్ను పెంచిన పద్ధతి ఇదేనా? అని కోపం వ్యక్తంచేశారు. తండ్రి తనను తిడుతుండటంతో ఆమె తీవ్ర కన్నీటిపర్యంతమైంది. మిగతా కంటెస్టెంట్స్ ఆమె తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. అనంతరం తన తండ్రిని హత్తుకొని లోస్లియా ఏడ్చింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సదరు తండ్రిపై అందూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ లోస్లియాకు అండగా నిలుస్తున్నారని, చానెల్‌లో కూతురిని దూషించడం పద్ధతి కాదంటున్నారు. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూ ఇంతకాలం పోటీలో ఉండగలిగినందుకు లోస్లియాను మీరు గర్వపడాలి కానీ దూషించడమేంటని నిలదీస్తున్నారు. అయితే లోస్లియా-కేవిన్ మధ్య ప్రేమాయాణం సాగుతున్నట్టుగా బిగ్‌బాస్ హోస్ట్ కమల్ హాసన్, అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రవర్తించిన తీరును కూడా వారంతా తప్పుబడుతున్నారు.