బిగ్ బాస్3 ది రియాలిటీ షో లో బుధవారం జరిగిన ఎపిసోడ్ గొడవకే దారితీసిందని చెప్పాలి. ఎప్పుడూ హౌస్ లో వాళ్ళ మధ్యనే గొడవ అయ్యేది. ఈసారి మాత్రం ఏకంగా బిగ్ బాస్ పైనే తిరుగుబాటు మొదలైంది. ఇక అసలు మేటర్ కి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో దయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ నిన్నటితో పూర్తికావడంతో. ఎవరి పర్ఫామెన్స్ ఎలా ఉంది అనేది బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇందులో పునర్నవి,మహేష్, శ్రీముఖి పర్ఫామెన్స్ అస్సల బాలేదని తేల్చి చెప్పేశారు. దాంతో వారి ముగ్గురికి మరో టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ కు పునర్నవి,మహేష్ ఒప్పుకోలేదు. మేము చెయ్యము అని చెప్పేశారు. అయితే పునర్నవి బిగ్ బాస్ కి వ్యతిరేఖంగానే ఉంది. కొద్దిసేపటికి బిగ్ బాస్ టాస్క్ చేయకపోతే డైరెక్ట్ గా ఎలిమినేట్ అవుతారని వార్నింగ్ ఇవ్వడంతో శ్రీముఖి, మహేష్ టాస్క్ కు ఒప్పుకున్నారు. కాని పురన్నవి మాత్రం ససేమీరా ఒప్పుకోలేదు. నన్ను పంపించేసిన పర్లేదు గాని మీ చెత్త టాస్క్ లు నా వల్ల కాదని చెప్పేసింది. బిగ్ బాస్ పై తిరగబడింది. మరి బిగ్ బాస్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
