ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన టెక్నాలజీ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏస్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని, దీనికోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ విధానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈసమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్తో పాటే సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు జగన్ మాట్లాడుతూ ఇసుక మాఫియాను అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వం పై ఏమాత్రం విమర్శలు రాకుండా చూడాలని అధికారులతో అన్నారు. వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎక్కడ ఇసుక కొరత ఉందో ఆ ప్రాంతాల్లో నిర్మాణ దారులకు సమాచారం ఇవ్వాలని, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్ధ ఏర్పాటు చేయాలన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటుచేసే ఆ అంశాలను పరిశీలించాలని కోరారు.