అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి దొరికిపోవడం ఖాయం. అలా చాలా మంది దొరికిపోతుంటారు. అయితే ఒక జంట అలాగే దొరికిపోయింది. వారిద్దరూ శృంగారంలో మునిగితేలిపోతుండగా సడన్ గా అందరికీ దొరికిపోవాల్సి వచ్చింది.. అది కూడ ఎక్కడ అనుకున్నారు. తాను పని చేస్తున్న పాఠశాలలోనే ఓ టీచర్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు.
ఆ ఉపాధ్యాయుడి రాసలీలను పసిగట్టిన గ్రామస్తులు.. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని ఉడుప్పమ్ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్.. అంగన్వాడీ వర్కర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే వీరిద్దరూ గత కొంతకాలం నుంచి పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఆ ఆవరణలోనే శృంగారం చేస్తున్నారు. విద్యార్థుల ముందు కూడా వారు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాలన్నింటినీ పిల్లలు ఎప్పటికప్పుడు తమ తల్లిదండ్రులకు చెప్తూ వచ్చారు. మొత్తంగా ఉపాధ్యాయుడి రాసలీలను గ్రామస్తులు పసిగట్టి మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం టీచర్‌కు దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags anganvadi worker illegal affair tamilanadu teacher