తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఆమె వయస్సు ప్రస్తుతం యాబై ఎనిమిదేళ్లు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా తమిళ సై సౌందర్ రాజన్ ఘనతను దక్కించుకున్నారు.
