తన పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్ రెడీ అంటున్నారు శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్. మొదటి సినిమా ధఢఖ్ తో నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో పవర్ఫుల్ పైలట్‌గా టైటిల్ రోల్ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అయితే ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది . అందుకే ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. పెళ్లికి చాలా టైమ్ ఉంది. అంతేకాదు నా పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. తిరుపతిలో చేసుకుంటా. హంగూ, ఆర్భాటాల్లాంటివి ఏవీ ఉండవు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా ఆహ్లాదకరంగా పెళ్లి వేడుక జరగాలని ఉంది. పెళ్లికి కంచి పట్టు చీర కట్టుకుంటాను అని చెప్పింది.
అలాగే విందులో దక్షిణాది వంటకాల్లో నాకు ఇడ్లీ–సాంబార్, పెరుగన్నం, పాయసం.. వంటివన్నీ ఇష్టం. అవన్నీ విందులో ఉంటాయి’’ అన్నారు. జీవిత భాగస్వామిగా ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? అని అడిగితే – ‘‘ఊహల్లో తిరిగే వ్యక్తి అక్కర్లేదు. చాలా ప్రతిభావంతుడు అయ్యుండాలి. అలాగే తన జాబ్‌ని ఎంతో ఇష్టంగా చేయాలి. అతన్నుంచి నేను ఎంతో కొంత నేర్చుకునేంత ప్రతిభావంతుడు అయ్యుండాలి. చమత్కారంగా ఉండాలి’’ అన్నారు జాన్వీ కపూర్.