జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడు. ఈ ఎన్నికల్లో వైసీపీని జనం అఖండ మెజారిటీతో గెలిపించారు.
జగన్ గెలిచిన అనంతరం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడానికి కృషి చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ చేస్తున్న పనులకు సర్వత్రా జనం హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు పెడుతున్నారని మండిపడ్డారు.100 రోజులకే ఇలా ఉండే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు గారూ? అని ప్రశ్నించాడు.
ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు @ncbn గారూ?. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2019