తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది.
అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ పరిశోధన కేంద్రం నగరంలో తార్నాక- నాగోల్ మెట్రో మార్గంలో ఉండటంతో ఆ మార్గాన్ని సైన్స్ కారిడార్ గా ఎంపిక చేసి.. మెట్రో స్థంబాలపై వీటిని ముద్రించనున్నారు అని మెట్రో ప్రకటించింది.