టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి.
ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం అని అప్పటివరకు నాకు చాలా మంది చెప్పారు. జాగ్రత్తగా ఉండండి అని సూచనలు.. సలహాలు కూడా ఇచ్చారు. అందుకే సమర సింహారెడ్డి మూవీలో నటించేటప్పుడు చిత్రం షూటింగ్ సమయంలో అసలు మాట్లాడేదాన్ని కాదు.
అయితే బాలకృష్ణ గారు నేను కూర్చోని ఉండటాన్ని గమనించి ఎంటమ్మా మౌనంగా ఉన్నావ్. ఏమి మాట్లాడల్లేవ్ అని అడిగారు. అంతే నేను ఇదే విషయాన్ని బయట ఆయన గురించి ఎమనుకుంటున్నారో అదే వివరంగా చెప్పాను. దానికి సమాధానంగా నేను ప్రతి రోజు ఉదయం యోగా.. వాకింగ్ చేస్తాను. కోపాన్ని చాలా తగ్గించుకున్నాను అని ఆయన బదులిచ్చారని సంఘవి చెప్పుకొచ్చింది.