వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. అలనాటి అందాల బ్యూటీ,సీనియర్ హీరోయిన్ సంఘవికి ఒక ప్రముఖ హీరో,స్టార్ కమెడియన్ సోదరుడు డైలీ ప్రేమలేఖలు రాసేవాడు అంట. ఈ విషయం హీరోయిన్ సంఘవి నే స్వయంగా తెలిపింది. ఈటీవీలో ప్రసారమై ఆలీ హోస్ట్ గా ఒక కార్యక్రమంలో నటి సంఘవి పాల్గొన్నది.
ఈ కార్యక్రమంలో ఆలీ మా తమ్ముడు పేరు ఖుయ్యాం బలే గుర్తుంది కదా అని అడిగాడు. దీనికి సమాధానంగా సంఘవి మాట్లాడుతూ” ఎందుకు గుర్తు ఉండడు మీ తమ్ముడు. నేను ఊరికి మొనగాడు చిత్రంలో నటిస్తున్న సమయంలో మీ తమ్ముడు ఒక పాత్రలో నటించాడు. డైలీ గులాబీ పూవ్వుతో పాటు ప్రేమలేఖలు రాసి ఇచ్చేవాడు.
నేను నవ్వుకునేదాన్ని. హీరో శ్రీకాంత్ తో కల్సి మీ తమ్ముడిని ఏడ్పించేవాళ్లం. ఈ క్రమంలో మీ తమ్ముడు నాకు లవ్ లెటర్ ఇవ్వగానే ” శ్రీకాంత్ కూడా నన్ను లవ్ చేస్తున్నాడు . నేను అతనికి నో చెబితే సినిమా ఆగిపోతుంది . ఏమి చేయాలని మీ తమ్ముడ్ని అడిగితే సినిమా పోతే నేను లేనా మిమ్మలని చూసుకోవడానికి .. నేను మీరు లేకుండా ఉండలేను .. ఆయనకు నో చెప్పకుండా నాకు మాత్రం ఎస్ చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలని అనేవాడు అని ఆమె నవ్వుతూ బదులిచ్చింది.