ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తనయుడు నారా లోకేష్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అదికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని నిరసనగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆత్మకూరు బయలుదేరుతున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడులో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అలాగే టీడీపీ ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని కూడా ఆయన వెల్లడించారు.
