గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ కి దూరంగా ఉంటున్నారని వస్తున్న వార్తలు తెలిసిందే. ఈ మేరకు వారు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణా రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. మాపై వస్తున్న వార్తలు తప్పుడు వార్తలని, ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేయకండి అని అన్నారు. మా నాయకుడు కేసీఆర్ తోనే మేము ఉంటామని చెప్పుకొచ్చారు. తమపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని అది మానుకోవాలని చెప్పడం జరిగింది.కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు.
