జగన్ క్యాబినేట్ లోని మంత్రులు డమ్మీలుగా మారారని కొందరు చెప్పుకుంటున్నారు. తాము చెప్పింది అధికరారులు విననప్పుడు ఎందుకీ మంత్రి పదవులు అంటూ కొందరు వాపోతున్నారని, ఈ విషయాన్ని సీఎంకు చెప్పుకోలేక ఫీలవుతున్నారట.. ఏంచేయాలో తోచక అసంతృప్తికి గురవుతున్నారనే టాక్ మొదలైంది. తమ శాఖల పరిధిలోనే తమ మాట చెల్లుబాటు కావట్లేదని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మాట వినడం లేదట.. ఆయా శాఖాధిపతులను, ముఖ్యమైన అధికారులను స్వయంగా జగనే నియమించడంతో వారంతా మంత్రుల మాటలను పెద్దగా లెక్కచేయట్లేదట. సీఎం జగన్ ప్రతీ విషయానికీ అధికారులపైనే ఆధారపడుతున్నారని, మంత్రులనుపరిగణనలోకి తీసుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీఎం అధికారులనే నమ్ముకోవడంతో తమ శాఖల పరిధిలోని సెక్రటరీలు, కీలక అధికారులు తమను లెక్కచేయట్లేదని మంత్రులు వాపోతున్నారట. అలాగే ఈ శాఖలపై పూర్తిగా తమదే అధికారమన్నట్టు కొందరు ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారట. ఈ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి భయపడుతున్నారట. కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనేనట.. సీఎం ఇస్తోన్న ప్రాధాన్యతను ఉపయోగించుకొని కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎవ్వరినీ కేర్ చేయట్లేదట. ఒకరిద్దరు మంత్రులు కాస్త ధైర్యంచేసి ఈ వ్యవహారాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆయన సన్నిహితులు వద్దని వారించారట.
పాలనపై పట్టుకోసం అధికారులకు జగన్ గారు స్వేచ్ఛనిచ్చింది నిజమేనని, కానీ వాళ్ల పనితీరుపై కూడా ఆయన కన్నేసి పరిశీలిస్తున్నారని, అధికార యంత్రాంగంపై పూర్తిగా పట్టు దొరికిన తర్వాత అందర్నీ సెట్ రైట్ చేద్దామని చెప్తున్నారట. అప్పటిదాకా ఓపిక పట్టాలని సీఎం సన్నిహితులు మంత్రులను వారిస్తున్నారట. మరోవైపు సీనియర్లమై ఉండి కూడా సదరు అధికారుల అరాచకాన్ని భరించలేమని పలువురు మినిస్టర్లు ఫీలవుతున్నారట.. సీఎం ఇచ్చిన చనువు, అధికారాలతోనే తమను పట్టించుకోవట్లేదని మండిపోతున్నారు. దీనికితోడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం టైమ్ ఇవ్వట్లేద. కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులతోనే సమీక్షలు నిర్వహించడం, బదిలీల విషయంలో కూడా తనకు పర్ ఫెక్ట్ అనిపించిన వాళ్లను మాత్రమే నియమిస్తుండటంతో మంత్రిగణం అసంతృప్తికి గురవుతోందని వెలగపూడి టాక్.