ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కొన్ని సాంకేతిక లోపల వల్ల విఫలమవ్వడంతో ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ తో యావత్ దేశం భావోద్వేగానికి గురయ్యిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ ఇండియాన్స్ ను అవహేలను చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా “INDIAFAILED” అని ట్యాగ్ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన ఇండియన్ నేటీజన్లు అతడికి చురకలు అంటించారు. టెక్నాలజీ రంగంలో మీరు సాధించిన విజయాలు ఏమిటో ఒకసారి చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రముఖులు కూడా స్పందించారు. ఇందులో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ఇతడైతే మంత్రికి గట్టిగా ఇచ్చాడనే చెప్పాలి. టెక్నాలజీ మంత్రి ట్వీట్ కి ధీటుగా స్పందించిన హీరో.. కనీస తెలివిలేని ని బుర్రకి మంత్రి పదవి ఎలా కట్టబెట్టారని కామెంట్ చేసాడు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా తెలియని నువ్వు మినిస్టర్ ఎలా అయ్యావో అర్ధంకావడం లేదని అన్నాడు.
