తెలంగాణ రాష్ట్ర సర్కారు 2019-20ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉభయ సభలు శనివారంకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఈ వార్షిక బడ్జెట్లో ఉంచిన ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నులు,పన్నేతర ఆదాయం మొత్తం రూ.1,13,099కోట్ల వస్తాయని తెలంగాణ రాష్ట్ర సర్కారు తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాబడి.. వ్యయాలపై ఒక లుక్ వేద్దాం
వడ్డీ రాబడి మొత్తం రూ.117.98కోట్లు
పన్నేతర రాబడి మొత్తం రూ.23,934.80 కోట్లు
రాష్ట్ర పన్నులు,సుంకాలు రూ.69,328.57కోట్లు
కేంద్ర పన్నుల వాటా రూ.19,718.57కోట్లు
పన్ను వసూలు ఛార్జీలు రూ.743.43 కోట్లు
పరిపాలన సేవలు రూ.6,621.67కోట్లు
రుణ సంబంధ సేవలు రూ.14,584.73కోట్లు
ఇతర వ్యయం రూ.11,078.66కోట్లు
మిగులు రూ.2,044.08 కోట్లు
