తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను.
నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. నేను కేసీఆర్ గారిని అతి దగ్గర నుంచి చూస్తున్నాను. నామీద కేసీఆర్ గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఒళ్లు దగ్గర పెట్టుకుని జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి పనిచేస్తాను. మంత్రిగా జిల్లా ప్రజలకు సేవ చేస్తాను అని ఆయన అన్నారు.